Monday, July 25, 2011


Sunday, July 24, 2011

Bhimavaram History


పంచారామములలొ ఒకటైన ఈ భీమవరం సోమేశ్వర స్వామి క్షేత్రం. తూర్పు చాళుక్య రాజైన భీమ క్రీ.శ. 890-918 సంవత్సరాల మధ్య ఇక్కడ సోమేశ్వర దేవాలయానికి శంకుస్థాపన చేశాడు.ఈ దేవాలయం ఇప్పుడు గునుపూడి లొ ఉన్నది. తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద ఈ పట్టణం భీమవరం అని పేరు వచ్చింది. క్రీ.శ.1120-1130 సంవత్సరాల మధ్య ప్రక్కను ఉన్న విస్సాకోడేరు,ఉండి,పెద్దఅమిరమ్ గ్రామాలకు రహదారి ఏర్పడింది.

Bhimavaram Someswara Swamy Temple


భీమవరంలోని సోమేశ్వరస్వామి దేవాలయం (భీమారామం) పంచారామాలలో ఒకటి. ఈ భీమారామము భీమవరమునకు రెండుకిలోమీటర్లదూరంలో గునుపూడిలో కలదు. ఇక్కడిలింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడుతుంది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.

శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము కృమ క్రమముగా అమావాస్య వచ్చే సరికి బూడిద లేదా గోధుమ వర్ణమునకు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్టించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయం ముందు కోనేరు ఉంది. ఈ కోనేరు గట్టున రాతి స్థంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.

Bhimavaram Mavullamma Temple


చారిత్రక నేపధ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్రవిశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంది అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమయినది. అటునుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపిఉంచారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో 'మామిళ్ళమ్మ'గా తదనంతరం 'మావుళ్ళమ్మ'గా పిలవటం అలవాటయ్యింది. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మద్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘము వారి ఆద్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి.
ఇప్పుడూన్న మావుళ్ళమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్లక్రితం వరకూ ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూచేందుకు భయపడేవిధంగా ఉండే అమ్మవారిని అనేక సార్లు మార్చుకొంటూ ఇప్పటి రూపానికి తీసుకొచ్చారు.
1910 సంవత్సరంలో వరదల కారణంగా అమ్మవారి విగ్రహం నీటిలో నాని చాలా వరకూ దెబ్బతిన్నది. దానితో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అనే శిల్పి ద్వారా అమ్మవారి పునర్నిర్మాణం జరిగింది. గర్భాలయానికి నిండుగా అమ్మవారికి రూపాన్నిచ్చాడూ. అయితే అప్పటికి ప్రలయభీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు. గర్భాలయానికి ఇరుప్రక్కలా అహింసకు ప్రతీకలైన రామకృష్ణ పరమ హంస, గౌతమ బుద్ధుడు విగ్రహాలను చెక్కారు.
మెంటే వెంకటస్వామి పూర్వికులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంభీకులు అమ్మవారి పుట్టింటి వారు గానూ, గ్రంధి అప్పన్న, తదితరులు అమ్మవారి అత్తింటివారుగానూ వ్యవహరిస్తారు.